logo

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ

ఏపీలో విపరీతమైన అవినీతి జరుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. అవినీతిని పెకిలించడానికి బుల్డోజర్లు కావాలన్నారు. రాష్ట్రంలో ఏ మేర అవినీతి జరుగుతుందో చెప్పడానికి పట్టిసీమ ప్రాజెక్టే నిదర్శనమన్నారు. పట్టిసీమకు 16 వందల కోట్లు, స్పిల్ వేకు 1400 కోట్లు ఎందుకు ఖర్చు చేశారన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అన్నారు ఎమ్మెల్సీ సోమువీర్రాజు. నాయకుల దగర్నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా.. ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చెట్టు నీరుకు 4 వేల కోట్లు ఖర్చయ్యిందని.. ఆ డబ్బులతో పోలవరం స్పిల్ వే కట్టొచ్చన్నారు.

లైవ్ టీవి

Share it
Top