పవన్ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య !

Submitted by arun on Mon, 05/28/2018 - 11:31
pk

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పవన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ  ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు సైతం ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. అయితే రాజమండ్రిలో జనసేన ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పాల్గొనడం ఆసక్తిని రేపుతుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు. తాను ఎప్పట్నుంచో పవన్ అభిమానినని, ఆయన ఆశయాలు-ఆవేశాలు తనకు నచ్చుతాయని చెబుతోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్ పోరాడుతున్న తీరు చూసి స్ఫూర్తి పొందానని చెప్పింది. భర్త బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. తనకు ఎటువంటి అడ్డూ చెప్పలేదంటోంది ఆకుల లక్ష్మీ పద్మావతి. రేపటిరోజున అవకాశమొస్తే.. భార్యాభర్తలిద్దరూ జనసేనలోకి జంప్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజమండ్రి జనాభా.


వామ్మో పవన్ దీక్షలో "ఆ" ఎమ్మెల్యే భార్య !

English Title
bjp mla akula satyanarayana wife supports janasena

MORE FROM AUTHOR

RELATED ARTICLES