చంద్రబాబుపై దాడిని తీవ్రతరం చేసిన బీజేపీ...సీబీఐ విచారణ...

Submitted by arun on Fri, 08/24/2018 - 08:59
bjp

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేతలు వార్‌ ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నేరుగా గవర్నర్‌కే ఫిర్యాదు చేశారు. అమరావతి బాండ్ల లిస్టింగ్‌ కూడా అవినీతి కోసమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.


ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొని బీజేపీని, మోడీని కార్నర్ చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ కమలనాథులు తమ దాడిని తీవ్రతరం చేశారు. పీడీ అకౌంట్‌లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తోన్న బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదుచేశారు. కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికీ లేనన్ని పీడీ అకౌంట్స్‌ ఏపీలో ఉన్నాయన్న బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మొత్తం 53వేల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు.

ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్న సోము వీర్రాజు ముడుపులు కోసమే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రైవేట్‌రంగ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీ అకౌంట్స్‌ విషయంలో సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్ధంకావడం లేదన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

బీజేపీ నేతల ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే గవర్నర్ దగ్గరకు రండి మీ అవినీతి, మా అవినీతిపై విచారణ జరుపుదామని సవాల్ విసిరారు. బీజేపీ నేతల ఫిర్యాదుపై గవర్నర్‌ నర్సింహన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పీడీ అకౌంట్స్‌‌పై నివేదిక తెప్పించుకున్నానని, అదనపు సమాచారం ఉంటే ఇవ్వాలని గవర్నర్‌ కోరినట్లు జీవీఎల్‌ తెలిపారు. 

English Title
BJP leaders submit representation to Governor over PD accounts scam

MORE FROM AUTHOR

RELATED ARTICLES