ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుంది

x
Highlights

నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. డీఎస్‌పై కవిత చేసిన...

నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. డీఎస్‌పై కవిత చేసిన ఆరోపణలు.. ఆమె రాజకీయ అపరిపక్వతను సూచిస్తోందని.. అన్నారు. ఆరోపణలు వింటేనే నవ్వొస్తొందని.. కుమారుడిపై కోపంతో.. తండ్రి పై చర్యలు తీసుకోవం హాస్యాస్పదం అన్నారు. ‘టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆమె చేయలేదు. ఏదో సెలబ్రిటీగా ఎప్పుడో ఓసారి జిల్లాలో పర్యటించేవారు తప్ప ఆమె నిజామాబాద్‌ జిల్లా కోసం చేసిందేమీ లేదు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్యకర్తలు స్వయంగా డీఎస్‌కు లేఖలు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్‌ అంతా సాధారణంగా పనిచేస్తుంది. గత మూడు రోజులుగా డీఎస్‌ ఏ కాంగ్రెస్‌ నేతను కలిశారో చెప్పాలని’ అరవింద్‌ డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories