బీజేపీ ఎంపీలకు త్రీలైన్ విప్ జారీ

Submitted by arun on Wed, 07/18/2018 - 17:33
bjp
శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరగనుండటంతో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ త్రీలైన్ విప్ జారీ చేసింది. శుక్రవారం బీజేపీ ఎంపీలంతా విధిగా సభకు హాజరుకావాలని ఆదేశించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రపభుత్వం ఒప్పుకోవడంతో.. దేశమొత్తం పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. సభకు హాజరుకాని ఎంపీలపై అనర్హత వేటు వేస్తామని విప్‌లో హెచ్చరించింది. కాగా, అవిశ్వాస తీర్మానంపై 50 మందికి పైగా ఎంపీలు మద్దతు ఇవ్వడంతో నిబంధనల ప్రకారం పది రోజుల్లోగా చర్చను స్పీకర్ సభలో చేపట్టాల్సి ఉంటుంది.
English Title
BJP issues whip to MPs: Be in Parliament for Friday's no-confidence debate

MORE FROM AUTHOR

RELATED ARTICLES