తెలంగాణలో ఎన్నికలు : బీజేపీ నాలుగో జాబితా విడుదల

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 08:33
bjp fourth list out now

తెలంగాణలో ఎన్నికల నామినేషన్లకు కేవలం రెండు రోజులే ఉంది. దాంతో రాజకీయపార్టీలు వేగం పెంచాయి. తెరాస ఇప్పటికే ఓ ఇద్దరు మినహా తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. మహాకూటమి కూడా ఈరోజు మిగిలిన సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. అలాగే మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా మరో లిస్ట్ విడుదల చేసింది. ఇప్పటికే 86 నియోజకవర్గాలకు కేండట్లను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. తాజాగా ఏడు స్థానాలతో నాలుగో జాబితా విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌- శ్రీధర్‌రెడ్డి, నర్సంపేట్‌- ఎడ్ల అశోక్‌రెడ్డి,సనత్‌నగర్‌- భావర్‌లాల్‌ వర్మ, పాలకుర్తి- సోమయ్య గౌడ్‌ , చెన్నూరు - అందుగుల శ్రీనివాసులు, జహీరాబాద్‌- జంగం గోపి, గజ్వేల్‌- ఆకులవిజయ లకు టిక్కెట్లు కేటాయించింది. కాగా మొదటి జాబితాలో 38 స్థానాలు, రెండో లిస్టులో మరో 28 మందికి అవకాశం కల్పించింది. మూడో జాబితాలో 20 స్థానాలకు టికెట్లు ఖరారు చేసి నాలుగో జాబితాలో ఏడుమందికి సీట్లు ఇచ్చింది బీజేపీ.

English Title
bjp fourth list out now

MORE FROM AUTHOR

RELATED ARTICLES