సంజయ్‌పై కఠిన చర్యలకు ఆయన సోదరుడు అరవింద్ డిమాండ్

Submitted by arun on Fri, 08/10/2018 - 17:45

డీఎస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్‌ సంజయ్‌పై లైంగిక వేధింపుల కేసుపై సోదరుడు ధర్మపురి అరవింద్ స్పందించారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన డి. సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవలసిందేనని ఆయన సోదరుడు, బీజేపీ నేత అరవింద్ డిమాండ్ చేశారు. సంజయ్‌కు వ్యతిరేకంగా ఆధారాలుంటే తప్పకుండా శిక్షించాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం సంజయ్‌కి తన కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదంటున్నారు అరవింద్‌. సంజయ్‌ది వేరే పార్టీ.. తనది మరో పార్టీని చెప్పుకొచ్చారు. తాను తన తండ్రి డీఎస్‌నే విభేదించి బీజేపీలోకి వెళ్లానని తెలిపారు. డీఎస్ కూడా బీజేపీలోకి వస్తారనే ప్రచారం బేస్ లెస్ అన్నారు. తాను టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నానన్నారు. తన తండ్రి డీఎస్.. సోదరుడు సంజయ్ ఇద్దరూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారని గుర్తుచేశారు. అది వారి వ్యక్తిగతమన్నారు. వారితో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

English Title
BJP Dharmapuri Arvind Kumar Face to Face over His Brother D Sanjay Case

MORE FROM AUTHOR

RELATED ARTICLES