బిట్ కాయిన్‌ మన అకౌంట్లలోకి ఎలా వస్తుందంటే

బిట్ కాయిన్‌ మన అకౌంట్లలోకి ఎలా వస్తుందంటే
x
Highlights

రిపిల్‌. దీన్ని 2012 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది బ్యాంకులు, పేమెంట్స్‌ ప్రొవైడర్లు, డిజిటల్‌ అసెట్‌ ఎక్స్ఛేంజీలు, కార్పొరేట్లను అనుసంధానం చేస్తుంది....

రిపిల్‌. దీన్ని 2012 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది బ్యాంకులు, పేమెంట్స్‌ ప్రొవైడర్లు, డిజిటల్‌ అసెట్‌ ఎక్స్ఛేంజీలు, కార్పొరేట్లను అనుసంధానం చేస్తుంది. దీన్ని బిట్‌కాయిన్‌ డెవలపర్లు రూపొందించారు. ఎక్స్‌ఆర్‌పి అనేది రిపిల్‌ క్రిప్టోకరెన్సీ. బిట్‌కాయిన్‌ విలువ పెరుగుతున్నప్పటి నుంచి దీని విలువ కూడా పెరుగుతోంది. ఇథేరియం. ఇది బిట్‌కాయిన్‌కు టఫ్‌ కాంపిటీషన్ ఇస్తోంది. 2014 సంవత్సరంలో ఇది అందుబాటులోకి వచ్చింది.
జడ్‌క్యాష్‌...ఇది కూడా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఆవిర్భవించినదే. 2016 అక్టోబరులో జడ్‌క్యాష్‌ ప్రారంభమైంది.
లైట్‌ కాయిన్‌...ఇది బిట్‌కాయిన్‌తోపాటు ఐఒటిఎ, రిపిల్‌కు గట్టి పోటీనిస్తోంది. లైట్‌ కాయిన్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబరు 12 వరకు 5,700 శాతానికి పైగా పెరిగింది. ఇదే సమయంలో బిట్‌ కాయిన్‌ 1,550 శాతం వృద్ధి చెందింది. 2011 సంవత్సరం ఇది అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ మాజీ ఉద్యోగి చార్లీ లీ ఈ పీర్‌ టు పీర్‌ క్రిప్టో కరెన్సీని సృష్టించారు.
ఐఒటిఎ..దీని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారుగా 0.75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
డాష్‌..ఇది ఓపెన్‌ సోర్స్‌ పీర్‌ టు పీర్‌ క్రిప్టోకరెన్సీ. దీన్ని ఇన్‌స్టాంట్‌ చెల్లింపుల కోసం వినియోగించవచ్చు. ఆన్‌లైన్‌, ఇన్‌స్టోర్‌లోనూ చెల్లింపుల కోసం దీన్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు.
మొనెరో...ఇది 2014 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చాలా సురక్షితంగా, ప్రైవేటుగా లావాదేవీలు నిర్వహించవచ్చని చెబుతుంటారు.
ప్రస్తుతం మార్కెట్లో ఇలా ఎన్నో డిజిటల్ క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటన్నింటిలోకెల్లా బిట్‌కాయిన్ అత్యంత ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటివరకు ఆర్‌బీఐతో సహా ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ కూడా బిట్‌కాయిన్‌కు కరెన్సీగా అధికారిక గుర్తింపునివ్వలేదు.
ప్రస్తుతం బిట్‌కాయిన్లు కొనాలంటే ఆన్‌లైన్ exchangeలను ఆశ్రయించాల్సిందే. దీనికోసం ఆయా ఎక్స్ఛేంజీల్లో ఒక ఖాతా క్రియేట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఈ ఖాతాయే మనం కొనే బిట్‌కాయిన్లను దాచిపెట్టుకునే వాలెట్. మన అకౌంటు వెరిఫికేషన్ పూర్తయ్యాక... సరిపడే మొత్తాన్ని exchange కి బదలాయిస్తే మన వాలెట్‌లోకి బిట్‌కాయిన్లు వచ్చి చేరతాయి. బిట్‌ కాయిన్ల exchageలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. మన ఇండియాలో నాలుగుంటే, హైదరాబాద్‌లో ఒకటి ఉంది. btcx పేరుతో నెలకొల్పారు. అయితే ఈమధ్య బిట్‌కాయిన్ ఎక్చేంజీల్లో కోట్లకు కోట్లు లావాదేవీలు జరుగుతుండటం, నల్లడబ్బు ప్రవహిస్తుండటంతో, ఈమధ్య ఐటీ శాఖ అధికారులు, బిట్‌కాయిన్‌ ఎక్చేంజీల్లో తనిఖీలు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories