ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలి రద్దు చేస్తాం

ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలి రద్దు చేస్తాం
x
Highlights

ఆర్డినెన్స్‌ ద్వారా టీటీడీ ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామని ఏపీ దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు....

ఆర్డినెన్స్‌ ద్వారా టీటీడీ ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామని ఏపీ దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు.శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, త్వరలోనే టీటీడీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories