ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ..

ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ..
x
Highlights

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఐదు స్థానాల‌కు గాను ఆరు మంది నేత‌లు పోటీ ప‌డుతున్నారు. టీఆర్‌ఎస్ దాని మిత్రపక్షం నుంచి...

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఐదు స్థానాల‌కు గాను ఆరు మంది నేత‌లు పోటీ ప‌డుతున్నారు. టీఆర్‌ఎస్ దాని మిత్రపక్షం నుంచి ఐదుగురు. కాంగ్రెస్ నుంచి ఒక‌రు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పార్టీల బలాబలాలను పరిశీలిస్తే ఒక‌రు ఓట‌మిపాలు కాక త‌ప్ప‌దు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఓడిపోయే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నామినేషన్ గడువు ఇప్పటికే ముగిసింది. ఐదు స్థానాల‌కు గాను టీఆర్‌ఎస్ త‌రుపున ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ కూడా ఒక అభ్యర్థిని రంగంలోకి దించడంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ తరపున ఎగ్గే మల్లేశం, శేరి శుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, హోం మంత్రి మ‌హ‌మ్మూద్ అలీ నామినేష‌న్ దాఖలు చేయగా. ఎంఐఎం నుంచి ఒకరికి నామినేషన్ వేశారు. ఇక కాంగ్ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ ఎస్ ఖ‌చ్చితంగా 5 సీట్లు గెలిచి తీరుతామ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకుంటూనే టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై ఆశ‌లు పెట్టుకుంది.

ఎమ్మెల్సీ గా గెల‌వాలంటే 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. స‌భ‌లో టీఆర్ఎస్‌కు 90 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేలు 7గురితో కలిపి మొత్తం టీఆర్ఎస్ బలం 98 కు చేరుతుంది. ఒక్కొక్క అభ్య‌ర్థికి 20 ఓట్లు చొప్పున 5 గురికి క‌లిపి మొత్తం 100 ఓట్లు టీఆర్ ఎస్ కు అవ‌స‌ర‌మ‌వుతాయి. అయితే టీఆర్ఎస్‌కు 2ఓట్లు తక్కువ ఉన్నాయి. అయితే టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కూడ టీఆర్ ఎస్ అభ్య‌ర్థికే ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌కు సొంతంగా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి ఆగ్రం సక్కు, రేగా కాంతారావులు గులాబీ గూటికి చేరుతున్నారు దీంతో కాంగ్రెస్ బలం 17కి పడిపోయింది. ఇక టీడీపీ నుంచి గెలిచిన మెచ్చ నాగేశ్వ‌ర రావు త‌మ‌కే ఓటు వేస్తార‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్రిప‌రెన్స్ ఓటింగ్ విదానం ఉంటుంది కాబ‌ట్టి రెండో ప్రిప‌రెన్స్ ఓటు కూడా ప్రాధాన్య‌త గా కాబోతుంది. బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండే అవ‌కాశాలున్నాయి. ఎమ్మెల్సీని అభ్యర్థిని గెలిపించుకునే బలం తమకుందని కాంగ్రెస్ భావిస్తోంది. త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌టంతో పాటు. టీడీపీ ఎమ్మెల్యేల ఓట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. మొత్తానికి ప్రస్థుత పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories