నాని దగ్గర అంత స్టఫ్ లేదు.. బిగ్ బాస్ పై బాంబ్ పేల్చిన సంజనా..!

Submitted by arun on Tue, 06/19/2018 - 12:50
sanjana

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ప్రవేశించి, తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సంజన, కార్యక్రమ వ్యాఖ్యాత, హీరో నానిపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. తాను ఎన్.టి.ఆర్ ఫ్యాన్.. అయినా నాని సినిమాలను చూస్తాను.. బిగ్ బాస్ నడిపించే స్టఫ్ నాని దగ్గర లేదని అన్నది సంజనా. ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారని, తొలి సీజన్ అంత పెద్ద హిట్ కావడానికి ఎన్టీఆర్ కారణమని వ్యాఖ్యానించిన సంజన, ఆ స్థాయిలో నాని పెర్ ఫార్మెన్స్ లేదని అభిప్రాయపడింది. "ఎన్టీఆర్ ఎక్కడ? నానీ ఎక్కడ? అందుకే నేను బయటకు వచ్చినా పెద్దగా బాధపడలేదు. బిగ్ బాస్ లో మరో అవకాశం వచ్చినా వెళ్లను" అని చెప్పింది.

హౌజ్ ఉన్న వారం రోజుల్లో అక్కడ వారితో గొడవలు పడిన సంజనా బయటకు వచ్చాక బిగ్ బాస్ షో మీద నిందలు వేయడం మొదలుపెట్టింది. ఇక వారం రోజులు తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని కేవలం తన కాస్టూమ్స్, ఇంకా ఫుడ్ ఫ్రీగా పెట్టారని అన్నది సంజన. అంతేకాదు తను ఇలా రాగానే నందిని అనే కంటెస్టంట్ ను లోపలకు పంపించారు. కేవలం తను రావడానికి వారం పడుతుంది కాబట్టి ఈ వారం తనని తీసుకున్నారని. భవిష్యత్ లో ఏ షోకైనా వస్తా కాని బిగ్ బాస్ రియాలిటీ షోకి మాత్రం వచ్చేది లేదని అన్నది సంజనా.     

English Title
Bigg Boss 2 Contestant Sanjana Anne Sensational Comments On Nani

MORE FROM AUTHOR

RELATED ARTICLES