అతని పక్కన పడుకోమన్నారు.. బిగ్‌బాస్‌టీంపై సంజన ఫైర్

Submitted by arun on Wed, 06/20/2018 - 07:43
sanjana

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఆడియన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే సంజన ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సంజన ప్లేస్ లోకి నందిని రాయ్ జాయిన్ అయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తనతో బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్ ఆడుకున్నారని, హౌస్ లోపల మొత్తం రాజకీయం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ 2 నుంచి బయటకు వచ్చిన సంజన ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ షోనుంచి మొదటగా ఎలిమినేట్ అయిన సంజన చెబుతోన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బిగ్ బాస్ హౌస్ లోపల తనను జైల్లో పెట్టి హింసించారని సంజన వాపోయింది. నూతన్ నాయుడుతో అప్పటికి గంట పరిచయం మాత్రమే.. తామిద్దరిని ఒకే బెడ్ ఉండే జైల్లో వేశారని.. అదే బెడ్ పై ఇద్దరూ పడుకోండి అని చెప్పిన వాళ్లూ ఉన్నారని తెలిపింది. అదెలా సాధ్యమని అడిగితే మధ్యలో దిండు అడ్డు పెట్టుకోండి అని సలహా ఇచ్చారని… గంట పరిచయం ఉన్న వ్యక్తితో ఎలా పడుకుంటానని.. ఒక వయసొచ్చాక అమ్మాయి కనీసం నాన్న పక్కన కూడా పడుకోదని సంజన కన్నీటి పర్యంతమైంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండడం చాలా కష్టమని, రేపో ఎల్లుండో నూతన్ నాయుడు, గణేష్ కూడా బయటకు వచ్చేస్తారని సంజన తెలిపింది.

మొదట బిగ్ బాస్ 2 కి నందిని రాయ్ ఎంపిక జరిగింది. కానీ ఆమెకు ఒంట్లో బాగాలేకపోవడంతో ఆ ప్లేస్ లో నన్ను ఎంపిక చేశారు. వారం తిరిగేసరికి నందిని కోలుకోవడంతో నన్ను బయటకు గెంటేశారు అని సంజన ఆరోపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే డ్రామా చేయాలి, రాజకీయం చేయాలి, ఎక్స్ పోజ్ చేయాలని ఆమె ఆరోపణలు గుప్పించింది. ఎంపిక చేయడం మొదలు ఎలిమినేట్ చేసే వరకు తన వెనుక పెద్ద రాజకీయమే జరిగిందని సంజన సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ‘నేను జైల్లో ఉంటూ ఇబ్బందులు పడుతుంటే మా అమ్మ ఏడ్చేసిందట.. నేను బయటకు వచ్చాక మా నాన్న నాతో ఓ మాట అన్నారు. నువ్వు లోపల ఉండడం కంటే బయట ఉండటమే నాకు సంతోషంగా ఉంది’ అన్నారు. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న వాళ్ళెవరికీ జాలి, దయ లేవని సంజన మండిపడింది. సామ్రాట్ ని రాజకీయం చేసి కెప్టెన్ చేశారని.. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నవారంతా స్వార్థపరులని సంజన తీవ్ర విమర్శలు చేసింది.

English Title
bigboss contestant sanjana hot comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES