నిజామాబాద్ టీఆర్ఎస్ లో ముసలం...ఛైర్మెన్ పదవి కోసం ఎమ్మెల్యే 50 లక్షలు డిమాండ్

Submitted by arun on Tue, 07/17/2018 - 16:54

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తాపై అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఏ ఎస్ పోశెట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి కోసం ఎమ్మెల్యే గణేశ్ గుప్తా 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్తే టీడీపీ నుంచి వలస వచ్చిన ఓ నాయకుడి భార్యకు పదవిని కట్టబెట్టారని ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలు నిజం కాదని గుడి మెట్లు ఎక్కి తన నిజాయితీ  చాటుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతిపరుడైన గణేష్ గుప్తాను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పోశెట్టి పిలుపునివ్వడం అధికారపార్టీలో కలకలం రేపుతోంది. 

English Title
Bigala Ganesh Vs AS Posetti

MORE FROM AUTHOR

RELATED ARTICLES