మహాకూటమిలో మరో ట్విస్ట్

Submitted by chandram on Sun, 11/18/2018 - 13:11

మహాకూటమిలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్ధానాల్లో  స్నేహపూర్వక పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.  గ్రేటర్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో పోటీకి కాంగ్రెస్ నేతలు సిద్ధమయినట్టు సమాచారం. పార్టీ అభ్యర్ధిగా మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. బుజ్జగింపుల కమిటీ సమావేశం అనంతరం మీడియాతో చిట్‌‌చాట్ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరపున తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ బీఫాంతోనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి ఇబ్రహీంపట్నం సీటు దక్కించుకున్న సామా రంగారెడ్డి  పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో  పోటీ చేస్తున్నట్టు ఆయన అన్నారు. 

English Title
Big Twist In Mahakutami

MORE FROM AUTHOR

RELATED ARTICLES