నేతల్లో టెన్షన్.. టెన్షన్..ఇక గంటలే మిగిలాయి

నేతల్లో టెన్షన్.. టెన్షన్..ఇక గంటలే మిగిలాయి
x
Highlights

నిమిషం నీరసంగా సాగుతోంది గంట ఘోరంగా కదులుతోంది 43 రోజుల నిరీక్షణకు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ఇన్ని రోజులూ వేగంగా గడిచిపోయాయి కానీ...

నిమిషం నీరసంగా సాగుతోంది గంట ఘోరంగా కదులుతోంది 43 రోజుల నిరీక్షణకు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ఇన్ని రోజులూ వేగంగా గడిచిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సెకను నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది బీపీ పెరుగుతోంది బయటకు ఎలా ఉన్నా లోలోపల మాత్రం ఫలితాలపై భయపడుతున్నారు.

ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మరోవైపు సమయం దగ్గరపడడంతో నేతలకు బీపీ పెరిగిపోతోంది అధికారం చేపట్టేది తామే అని బయటకు చెబుతున్నా లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు నేతలు

నేతల టెన్షన్ ను ఎగ్జిట్ పోల్స్ పీక్స్ కి తీసుకెళ్లాయి.

ఛానెళ్లు, సర్వే సంస్థలు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ, యూపీఏ కూటమికి, ఇతర ప్రాంతీయ పార్టీలకు వచ్చే సీట్లపై ఓ అంచనా వేశాయి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వచ్చాయి అయితే ఇందులో కొన్ని వైసీపీ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేశాయి మరికొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారం అంటున్నాయి దీంతో నేతల్లో బీపీ పెరుగుతోంది ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ నమ్మమని నేతలు చెబుతున్నారు.

ఎన్నికలయ్యాక ఏపీలో విజయం మాదే అనే ధీమాలో ఉన్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. ఖచ్చితంగా గెలుస్తాం అంటున్నారు అయితే నేషనల్ మీడియా సర్వేలు వారికి అనుకూలంగా ఉన్నా కొన్ని సంస్థల సర్వేలు వారిని భయ పెడుతున్నాయి లగడపాటి రాజగోపాల్, సీఓటర్స్, టుడే చాణక్యతో పాటు కొన్ని తెలుగు మీడియా సంస్థలు టీడీపీదే అధికారం అంటున్నాయి దీంతో వైసీపీ నేతల్లో భయం కనిపిస్తోంది. మొత్తానికి కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలు కావడంతో నేతల్లో బీపీ పెరుగుతోంది విజయం ఎవరిని వరిస్తుంది ఓటమి ఎవరిని బాధిస్తుందో తెలియక టెన్షన్ టెన్షన్ గా కాలం గడుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories