జగన్ పాదయాత్ర మాకు ఇబ్బంది కాదు: అఖిలప్రియ

Submitted by arun on Sat, 01/06/2018 - 17:38

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై ఏపీ పర్యటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ స్పందించారు. జగన్ పాదయాత్రతో తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అఖిలప్రియ అన్నారు. శనివారం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆమె ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం టూరిజంశాఖ అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. భక్తుల కోసం శ్రీశైలంలో రూ.6కోట్లతో లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో టూరిజం శాఖను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.కాగా అఖిలప్రియతో పాటు కేంద్రమంత్రి మహేష్‌శర్మ కూడా స్వామిని దర్శించుకున్నారు.

English Title
bhuma akhila priya respond over ys jagan padayatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES