ఘనంగా అఖిల ప్రియ పెళ్ళి వేడుకలు : హాజరవ్వని ప్రముఖులు

Submitted by admin on Wed, 08/29/2018 - 18:29
bhooma akhila priya marrige completed

ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిల ప్రియ భార్గవ రామ్‌ల పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి.వీరి పెళ్లి కోటకందుకూరు మెట్ట వద్ద గల భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది.పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50వేల మంది హాజరు కావొచ్చని అంచనా వేశారు.కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో నందమూరి హరికృష్ణ గారు మరణించడంతో పలువురు ప్రముఖులు,నేతలు ఉదయాన్నే హైదరాబాద్ తరలి వెళ్లారు.

గవర్నన్ నరసింహన్,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ ఇంకా పలువురు హాజరు కావాల్సి ఉండగా నందమూరి హరికృష్ణ మృతి నేపథ్యంలో వారంతా అటు తరలి వెళ్లారు.దాదాపు 5 వేల మంది వీఐపీలు ఒక్కసారే కూర్చోగల సామర్థ్యం ఉన్న కళ్యాణ మండపం పలువురి గైర్హాజరు అవడంతో కొద్దిగా బోసి పోయింది,కానీ సాధారణ ప్రజలు,బంధు మిత్రులు భారీగా హాజరవడంతో పెళ్లి తంతు ఘనంగా ముగిసింది.

English Title
bhooma akhila priya marrige completed

MORE FROM AUTHOR

RELATED ARTICLES