‘భరత్ అనే నేను’ ఆడియన్స్ రివ్యూ...బ్లాక్ బస్టర్ హిట్!

Submitted by arun on Fri, 04/20/2018 - 10:57
bharat ane nenu

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 20న (ఈరోజు) థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీజర్, ట్రైలర్స్ అదిరిపోవడంతో పాజిటివ్ బజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌కి పైగా విడుదలైన ఈ మూవీ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ యూఎస్ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ఇరగదీశాడని.. ఫస్టాఫ్‌, సెకండాఫ్ అని కాకుండా ఓవరాల్‌గా ‘భరత్ అనే నేను’ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వరుస ట్వీట్లు వస్తున్నాయి. ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్ సినిమాకే హైలైట్ అని ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో చాలా ఉన్నాయంటూ మొత్తానికి యంగ్ సీఎం బాగా ఇంప్రెస్ చేశాడంటున్నారు నెటిజన్లు.

English Title
bharat ane nenu public review and rating

MORE FROM AUTHOR

RELATED ARTICLES