తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున మహాద్వారం ద్వారా కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి...

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున మహాద్వారం ద్వారా కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శ్రీవారిని కేసీఆర్ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం అవుతారు.

శ్రీవేంకటేశ్వరుడి దర్శనార్థం నిన్న సాయంత్రానికే కేసీఆర్‌ తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్‌కు వైసీపీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం, నారాయణస్వామి, నవాజ్‌బాషా తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌తో పాటు వైసీపీ నాయకులు తిరుమల చేరుకున్నారు. తిరుమలలో తెలంగాణ సీఎంకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ స్వాగతం పలికి బస సౌకర్యం కల్పించారు.

రాత్రి తిరుమలలోని పద్మావతినగర్‌లో ఉన్న శ్రీకృష్ణ అతిథిగృహంలో కేసీఆర్ కుటుంబం బస చేసింది. ఇవాళ ఉదయం 5.30 గంటలకి కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం నుంచి తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories