సిద్దిపేట జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్‌

Submitted by arun on Wed, 06/27/2018 - 11:45

సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం లద్దూర్‌లో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. గ్రామంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి... వీధుల్లో పరిగెడుతూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. గ్రామస్తులు ఎలుగుబంటిని వెంబడించడంతో... ఓ ఇంట్లోకి దూరి.... ఒకరిపై దాడి చేసింది. దాంతో ఎలుగుబంటిని గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టారు. వన్య మృగాలు తరచూ గ్రామంలోకి వస్తున్నాయని... ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందో తెలియక భ‍యంతో వణికిపోతున్నామని గ్రామస్తులు అంటున్నారు. వన్య మృగాలు గ్రామంలోకి రాకుండా.... ఫారెస్ట్ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

English Title
Bear Hulchal In Maddur Mandal Of Siddipet District

MORE FROM AUTHOR

RELATED ARTICLES