అంతా కోహ్లి భజన చేస్తున్నారు

అంతా కోహ్లి భజన చేస్తున్నారు
x
Highlights

ప్రసుతం బీసీసీఐ అంతా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భజన బ్యాచ్‌గా మారిపోయిందని క్రికెట్‌ చరిత్రకారుడు, క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ సభ్యుడు...

ప్రసుతం బీసీసీఐ అంతా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భజన బ్యాచ్‌గా మారిపోయిందని క్రికెట్‌ చరిత్రకారుడు, క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ సభ్యుడు రామచంద్ర గుహ తీవ్రంగా ధ్వజమెత్తాడు. ఇది ఎంతలా అంటే కేంద్ర కేబినెట్‌ ప్రధాన నరేంద్ర మోదీని స్తుతించడం కంటే ఎక్కువగా ఉందంటూ చురకలంటించారు. ఈ మేరకు టెలిగ్రాఫ్‌ వార్తాసంస్థకు రాసిన కాలమ్‌లో కోహ్లిపై రామచంద్ర గుహా ధ్వజమెత్తారు. భారత క్రికెట్‌ బోర్డు అధికారులు, సెలెక్టర్లు, కోచింగ్‌ సిబ్బంది అంతా కూడా కోహ్లి ముందు చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తున్నారన్నాడు. వారంతా కోహ్లి ముందు మరగుజ్జుల్లా కనిపిస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటిదాకా బోర్డులో అవినీతి, బంధుప్రీతి ఉండగా దీనికి కొత్తగా వారికి ‘సూపర్‌ స్టార్‌ సిండ్రోమ్‌’ వ్యాపించిందని ఎద్దేవా చేశాడు. ‘బీసీసీఐలో తనకు సంబంధం లేని విషయాలను కూడా కోహ్లీ ప్రభావం చేయగలిగే స్థాయిలో ఉన్నాడు. భవిష్యత్‌ టూర్‌ షెడ్యూల్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ వ్యవహారాలపై సీఓఏ చర్చిస్తే కోహ్లీ అంగీకారం కూడా తీసుకోవాలని బోర్డు లీగల్‌ కౌన్సిల్‌, సీఈవో సూచించారు. కానీ కుంబ్లే ఒక్కడే అతడి ముందు స్వతంత్రంగా వ్యవహరించగలిగాడు’ అని గతంలో క్రికెట్‌ పరిపాలక కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన గుహ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories