నిఫా వైరస్‌పై వెలుగులోకొచ్చిన సంచలన విషయం

నిఫా వైరస్‌పై వెలుగులోకొచ్చిన సంచలన విషయం
x
Highlights

గబ్బిలాలు, పందుల వల్ల నిఫా వైరస్‌ వ్యాపిస్తుందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కేరళలో వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లోని గబ్బిలాలు, పందుల నుంచి...

గబ్బిలాలు, పందుల వల్ల నిఫా వైరస్‌ వ్యాపిస్తుందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కేరళలో వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లోని గబ్బిలాలు, పందుల నుంచి సేకరించిన నమూనాల్లో.. అసలు నిఫా వైరస్ లేదని పరీక్షా ఫలితాలు చెబుతున్నాయి. దీంతో నిఫా వైరస్ ఎలా ప్రబలింది..? అదెక్కడి నుంచి వచ్చిందన్న దానిపై మరిన్ని పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

నిఫా వైరస్.. యావత్ దేశాన్నే వణికిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఎంటరైందన్న వార్తలతో నిద్రలేకుండా చేసింది. ఇప్పటికే కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో ఏకంగా 12 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో వైరస్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక జనం భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ గబ్బిలాలు, పందుల నుంచి వ్యాపిస్తుందని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే అది నిజం కాదని ల్యాబ్ పరీక్షలు వెల్లడిస్తున్నాయి.

వ్యాధి ప్రబలిన పెరంబర సమీపంలోని గబ్బిలాలు, పందుల నుంచి 21 నమూనాలు సేకరించిన వేద్యాధికారులు.. మధ్యప్రదేశ్ రాజధాని బోపాల్‌లోని హై సెక్యూరిటీ ఆనిమల్ డిసీజెస్ లాబరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో.. ఫలితాలన్నీ ప్రతికూలంగా వచ్చాయని కేంద్ర ఆనిమల్ హస్బెండరీ కమిషనర్ ఎస్ పీ సురేశ్ తెలిపారు. 21 నమూనాల్లో నిఫా వైరస్ ఆనవాళ్లేవీ కనబడలేదని.. స్పష్టం చేశారు. దీంతో గబ్బిలాలు, పందుల నుంచి నిఫా వైరస్ వ్యాపించలేదని.. అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరి ఎలా వ్యాపించింది.. మృతులకు నిఫా వైరస్ ఎలా సోకిందో తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories