రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేకు జరిమానా

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేకు జరిమానా
x
Highlights

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ అజింక్య రహానె‌పై జరిమానా శిక్ష పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ అజింక్య రహానె‌పై జరిమానా శిక్ష పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నిర్దేశించిన సమయంలోపు కేటాయించిన ఓవర్లని రాజస్థాన్ టీమ్ వేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఆ జట్టు కెప్టెన్ రహానెకి రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రాత్రి సమయం కావడంలో మంచు ఎక్కువగా కురిసింది. ఈ కారణంగా రాజస్థాన్‌ బౌలర్లు బంతిపై పట్టు తెచ్చుకునేందుకు పదేపదే రుద్దడం వల్ల రెండో ఇన్నింగ్స్‌ ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో ధోనీ 75 (46బంతుల్లో 4సిక్సర్లు, 4ఫోర్లు) పరుగులతో రాణించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌ శనివారం నాడు జరిగిన మ్యాచులో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories