అరటిపండు తింటే మానసిక ఒత్తిడి మటుమాయం

అరటిపండు తింటే మానసిక ఒత్తిడి మటుమాయం
x
Highlights

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, ఇతర మినరల్స్‌ శరీరానికి ఎంతో అవసరం. అరటిపండు తింటే బరువు తగ్గుతారు. మానసికంగా ఆరోగ్యంగా...

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, ఇతర మినరల్స్‌ శరీరానికి ఎంతో అవసరం. అరటిపండు తింటే బరువు తగ్గుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అరటి పండులో ట్రిప్టోఫాన్‌ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టొఫాన్‌ సెరటోనిన్‌ హార్మోన్‌గా మారుతుంది. మెదడులో సెరటోనిన్‌ హార్మ్‌న్‌ స్థాయిలు తగ్గిపోతే మానసికి ఒత్తిడికి దారితీస్తుంది. సెరటోనిన్‌ నిల్వలు తగ్గిపోవడానికి శారీరక లక్షణాలు, మానసిక ఒత్తిడి, ఉద్రేకం వంటివి ప్రధాన కారణాలు. అరటిపండు తినడం వల్ల మెదడులో సెరటోనిన్‌ విడుదల పెరిగి, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.

ఒక అరటిపండు తింటే 3 గ్రాముల ఫైబర్‌, 100 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అరటిపండు మంచి స్నాక్‌. అరటిపండు తింటే తొందరగా ఆకలి వేయదు. రోజులో అవసరమైన 12 శాతం ఫైబర్‌ అరటిపండు తినడం వల్ల లభిస్తుంది. అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇవి మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయి.అరటిపండు తింటే శరీరంలో క్యాల్షియం నిల్వలు పెరుగతాయి. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories