నరసన్నపేటలో ఈసారి లక్కెవరికి...చిక్కెవరికి?

నరసన్నపేటలో ఈసారి లక్కెవరికి...చిక్కెవరికి?
x
Highlights

అనగనగా ఒక నరసన్నపేట. ఐదేళ్ల క్రితం అనూహ్యంగా ఒక అభ్యర్థిని అదృష్టం వరించి, గెలుపు తలుపు తట్టేలా చేసింది. హామీలు, వాగ్దానాలు కుమ్మరించి, లక్కుతో ఆయన...

అనగనగా ఒక నరసన్నపేట. ఐదేళ్ల క్రితం అనూహ్యంగా ఒక అభ్యర్థిని అదృష్టం వరించి, గెలుపు తలుపు తట్టేలా చేసింది. హామీలు, వాగ్దానాలు కుమ్మరించి, లక్కుతో ఆయన కిక్కు కొట్టారు. మరి ఆ లక్కు నిలబెట్టుకుంటాడా లేక చిక్కుల్లో చిక్కుకుంటాడా చిక్కుల్లేవ్ ఓన్లీ లక్కులేనంటున్న ప్రతిపక్షం, ఇప్పుడు మాత్రం విజయం పక్కా అని ఎందుకంటోంది ఓటరన్న ఎవరికి అనుకూలంగా తీర్పిచ్చాడు. ఎవరికి జోరుకు వీర తిలకం దిద్దాడా? ఉత్కంఠపోరుకు నెలవైన శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గం ఏమంటోంది?

నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మొత్తం నాలుగు మండలాల్లో అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో రెండవ స్థానంలో కాళింగ, మూడవ స్థానంలో కాపు సామాజిక వర్గాలున్నాయి. 208469 ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోనే పోలింగ్ కి సంబంధించి రెండవ స్థానంలో నిలిచేలా 80.00 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 82039 మంది పురుషులు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 84731 మహిళలు ఇక్కడ ఓటు వేశారు..

1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించగా, టిడిపి మూడుసార్లు, ఇండిపెండెంట్లు నాలుగుసార్లు, 2012 ఉప ఎన్నికల్లో వైసిపి ఒక సారి విజయం సాధించాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విదంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ధర్మాన క్రిష్ణదాస్ పై 4800 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో మొదటిసారిగా అడుగుపెట్టారు. అనూహ్యంగా పార్టీ టిక్కెట్టును సంపాదించిన బగ్గు రమణమూర్తి విజయంపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ ప్రతిపక్షపార్టీలో అంతర్గత విభేధాలు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా ఈయన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టింది.

ఇక 2019 ఎన్నకలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో మొత్తం 9 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా పోటీ మాత్రం టిడిపి, వైసిపి మధ్య ప్రధానంగా నెలకొంది. అయితే దీనిపై టిడిపి అభ్యర్ధి బగ్గు రమణ మూర్తి , వైసిపి అభ్యర్ధి ధర్మాన క్రిష్ణ దాస్ ఇరువురు గెలుపు తమదంటే తమదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మండల స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన రమణ మూర్తి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా నరసన్నపేట సీటు దక్కించుకున్నారు.. ఈ నేపధ్యంలోనే సారవకోట, జలుమూరు మండలాలకు సాగు,త్రాగునీరు, పోలాకి మండలంలో తలపెట్టిన క్రిటికల్ ధర్మల్ పవర్ ప్లాంట్ ను రద్దు చేస్తాం, నరసన్నపేట పట్టణం నడిబొడ్డున ఉన్న రాజుల చెరువు అదేవిదంగా బౌద్దుల కాలం నాటి శాలిహుండం, పాండవులు వచ్చారని ప్రశిద్ది చెందిన జగతి మెట్ట వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తానని, గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తాం వంటి ప్రధాన హామీలతో గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళి విజయం ఆయన సాధించారు. ఇక ఇచ్చిన హామీలకు సంబందించి చేసిన పనులు, అందులోనూ ముఖ్యంగా దీర్గాకాలికంగా ఉన్న సారవకోట, జలుమూరు మండలాలకు సాగు, త్రాగునీరు అందించే నౌతల ఎత్తిపోతల పధకం, బొంతు ఎత్తిపోతల పధకం విషయంలో తాను సాధించిన విజయంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు, అదే విదంగా నాయకులు అందిస్తున్న అవినీతి రహిత పాలన ఖచ్చితంగా తనను ఈ ఎన్నికల్లో కూడా అందలం ఎక్కిస్తాయని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఇక వైసిపి విషయానికి వస్తే బలమైన క్యాడర్, జిల్లా కీలక నేత ధర్మాన ప్రసాదరావు సొంత నియోజకవర్గం కావడంతో పాటు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఇక్కడి అభ్యర్ధి కావడం ఆ పార్టీకి సానుకూలామ్శాలుగా కనిపిస్తున్నాయి.. గడిచిన ఐదేళ్ళ లో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతన్నా ఇసుక అక్రమాలుపై తాము చేసిన పోరాటం ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అవినీతి, జన్మభూమి కమిటీల పెత్తనంతో ప్రజలు విసిగిపోయారని మొదటి నుంచి వైసిపి మొదటి నుంచి బలంగా ప్రచారం చేస్తోంది. ఇక అధికార పార్టీ వైఫల్యాలను అదే విదంగా వారి తొందరపాటు నిర్ణయాల వాళ్ళ ఏర్పడిన సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి రచించిన వ్యూహాలు ఫలిచాయని, ఈ విషయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమ ఖాతాలో చేరుతాయనే చాలా ధీమావ్యక్తం చేస్తున్నారు.. దీనితో పాటుగా మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకంగా పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాలు, నియోజకవర్గంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత తో పాటు జగన్ చరిష్మా, పాదయ్త్రలో నియోజకవర్గ ప్రజల సమస్యలు పై జగన్ చేసిన వాగ్దానాలు , పార్టీ మనిఫెస్తో, జగన్ ప్రవేశాపెదతానని చెప్పిన నవరత్నాలు, మహిళలకు ఇచ్చిన హామీలు తో పాటు గ్రామ సచివాలయం వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఇవి తమకు విజయం చేకూరుస్తుందనే ధీమా వైసిపి అభ్యర్ధి కృష్ణదాస్ నుంచి వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటె జిల్లాలోనే పట్టుకలిగిన నాయకులుగా ధర్మాన సోదరులకు మంచి పేరే ఉంది. అయితే మొదటి నుంచి ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్నా ఇరువురి మధ్య విబేధాలు ఉన్నాయనేది జిల్లాలో ఉన్న చర్చ లేకపోలేదు. ఈ నేపధ్యంలో సొంతఇంటి వ్యక్తీ నుంచే ముప్పు పొంచి ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన. మరి సంచలనాలకు కొలువుగా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుంది.. ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా లభించబోతున్నాయి అనేది ప్రజలతో పాటు జిల్లా నాయకులలోనూ ఆసక్తిని రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories