భర్త రేప్ చేశాడంటూ పోలీస్ స్టేషన్‌కు భార్య..

Submitted by arun on Sat, 03/17/2018 - 14:53
rape case

బెంగళూరు నగరంలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఓ భార్య పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులోని బసవేశ్వరనగర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. లక్ష కట్నం తెస్తేనే తనతో సంసారం చేస్తానని బెదిరించి తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె చెబుతుంటే పోలీసులే కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే..ఆ మహిళకు, దేవ్‌కుమార్‌కు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. దేవ్‌కుమార్‌ ఒక ప్రవేటు సంస్థలో ఉద్యోగి. వీరికి పిల్లలు లేరు. వివాహమైన  నాలుగేళ్లు తరువాత భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు. భార్య తనకు సహకరించడం లేదని ఆరోపిస్తూ మరో మహిళతో దేవ్‌కుమార్‌ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయం అసలు భార్యకు ఇటీవలే తెలిసింది. భర్తను నిలదీయటంతో పుట్టింటి నుంచి రూ.లక్ష నగదు తీసుకు వస్తేనే నీతో సంసారం చేస్తానని చెప్పాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తరువాత తనను బెదిరించి భర్త తన కామవాంఛ తీసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచిత్రమైన ఈ ఘటన వివరాలు తెలుసుకుని పోలీసులు తలలు పట్టుకున్నారు. దేవ్‌కుమార్‌ను పిలిపించి, వారిద్దరికీ న్యాయనిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలని నిర్ణయించారు. 
 

English Title
bangalore woman files rape case against husband

MORE FROM AUTHOR

RELATED ARTICLES