రోడ్డుపై ఇద్దరు భర్తల బాహాబాహీ...భార్య మూడో వ్యక్తితో లేచిపోయింది...

Submitted by arun on Tue, 08/07/2018 - 11:34
bangalore

ఓ మహిళ తన భార్య అంటే తన భార్యే అంటూ రోడ్డుపైనే కొట్టుకోవడం చూసిన ఇద్దరు భర్తల ముద్దుల భార్యామణి...ఇద్దరికీ షాక్ ఇచ్చి మూడో వ్యక్తితో లేచిపోయిన విచిత్ర ఘటన బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. బెంగళూరు శివారు ప్రాంతానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తితో ఈ కిలాడీ లేడీ శశికళకు 2010లో వివాహయ్యింది. కొద్ది రోజులు కాపురం సాఫీగా సాగిపోగా.. తర్వాత కుటుంబ కలహాలతో భర్తను విడిచి వెళ్లింది. తర్వాత నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే రమేష్‌కుమార్‌తో ఆమె సహజీవనం చేసింది. 2015లో అతడ్ని వదిలేసి కుమార్ అనే మరో వ్యక్తిని బుట్టలో వేసుకుంది. అతడి దగ్గర కూడా ఆరు నెలలు గడిపిన శశికళ మళ్లీ హ్యాండిచ్చింది. మళ్లీ 2017లో చిక్కబిదరుకల్లుకు చెందిన ట్రాక్డర్ డ్రైవర్ మూర్తితో పరిచయం పెంచుకుంది. అతడికి వివాహంకాగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

మూర్తితో సహజీవనం చేస్తున్న శశికళ.. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేది. అయితే ఇక్కడే క్యాబ్ డ్రైవర్ సిద్ధరాజు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం పెరిగింది. అతడు శశికళను పెళ్లికూడా చేసుకుంటానని చెప్పడంతో ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే శనివారం సిద్దరాజు, శశికళ నేలమంగళ దగ్గర బస్టాప్‌లో ఉండటాన్ని.. మూర్తి గమనించాడు. కోపంతో వెళ్లి సిద్దరాజుతో గొడవపెట్టుకొన్నాడు. మాటా మాటా పెరగడంతో ఇద్దరు కొట్లాటకు దిగగా.. రోడ్డుపై వెళుతున్న జనాలు పక్కకు తీశారు. తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గుర్ని పీఎస్‌కు తీసుకెళ్లారు. 

పోలీసులు స్టేషన్‌లో పంచాయితీ పెట్టి.. ఏం జరిగిందని ఆరా తీశారు. అక్కడా శశిళక పెద్ద సినిమా స్టోరీ చెప్పింది. సిద్ధరాజు, మూర్తి తన స్నేహితులని చెప్పింది. ఒకరంటే ఒకరికి పడదని.. ఇద్దరిలో ఒకర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గొడవకు దిగారంది. ఇంతలో మరో వ్యక్తి శశికళ స్నేహితుడిని అంటూ అక్కడికి వచ్చాడు. పోలీసులకు కూడా తెలియకుండా.. ఆమెను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనుమానంతో పోలీసులు ఏం జరిగిందని సిద్దరాజు, మూర్తిలను ఆరా తీయగా.. వారు జరిగింది చెప్పారు. శశికళ గురించి ఆరా తీయగా మొత్తం స్టోరీ బయటపడింది. శశికళ ట్రాక్ రికార్డ్ తెలుసుకొన్న పోలీసులు.. మొత్తం ఐదుగురికి హ్యాండ్ ఇచ్చి ఆరో వాడితో జంపైపోయిందని తేల్చారు. ఈ ఎపిసోడ్ అంతా విని అవాక్కయ్యారు. ఆమె కోసం కొట్లాడిన సిద్దరాజు, మూర్తిలు కూడా కిలాడీ లేడీ బాగోతం తెలుసుకొని షాకయ్యారట.

English Title
bangalore 2 husbands fight on highway woman jump with third man

MORE FROM AUTHOR

RELATED ARTICLES