బండ్ల గణేష్ కనిపించటంలేదు! సోషల్ మీడియాలో ట్రోల్...

బండ్ల గణేష్ కనిపించటంలేదు! సోషల్ మీడియాలో ట్రోల్...
x
Highlights

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ అధికార...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఛానల్ ఇంటర్వులో మాట్లాడుతూ డిసెంబర్ 11 తేదినాడు మద్యాహ్నం రండి అని సవాల్ విసిరారు. మీడియా మిత్రులు బ్లేడులు, కత్తులు తీసుకురావాలని కోరారు. ఇక నేపథ్యంలో సోషల్ మీడియాలో బండ్ల గణేశ్ పై నెటిజన్లు ఓరేంజ్ ఆట ఆడుకుంటున్నారు. ఆరోజు సవాల్ విసిరిన బండ్ల గణేశ్ ఎక్కడ ఉన్నావ్ కత్తులు సిద్ధంగా ఉన్నాయ్ గొంతు కోసుకోవడానికి నువ్వు సిద్ధాంగా ఉన్నారా అని సెటైర్లతో సుక్కలు చూపిస్తారు నెటిజన్లు. ‘బండ్ల గణేష్ కనిపించటంలేదు! బండ్ల గణేష్ దుకాణం సర్దేశాడు! అని సోషల్ మీడియాలో బండ్లగణేశ్ పేరు కోడైకూస్తుంది. ఇక ఏకంగా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ స్వీట్‌ బాక్స్‌తో పాటు బ్లేడ్‌లతో ఆయన ఇంటికి వెళ్లగా, ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకే బండ్ల గణేశ్ నిరాకరించారట!

Show Full Article
Print Article
Next Story
More Stories