గులాబీ గూటికి ‘బండారి’!

Submitted by arun on Tue, 09/11/2018 - 11:41
bandari

హైదరాబాద్ ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ చార్జి బండారి లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించారు. ఉప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం బండారి లక్ష్మారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీతో అంటగాకి కాంగ్రెస్ రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని ఆయన తెలిపారు.. అందుకే టీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ నుంచి వీరేంద‌ర్ గౌడ్‌కు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కేటాయిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలుప‌డంతో బండారి ల‌క్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్లు తెలిపారు.

English Title
bandari-laxma-reddy-fire-tdp-and-congress-alliance

MORE FROM AUTHOR

RELATED ARTICLES