నాపై హత్యాయత్నం జరిగింది.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 14:35

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాల్క సుమన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓదేలు వర్గానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనపై బాల్క సుమన్ స్పందించారు. చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని బాల్క సుమన్ చెప్పారు. ఎవరి సీటును తాను కావాలని తీసుకోలేదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో తాను చెన్నూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోలు పోసి, అగ్గిపుల్ల వేసేందుకు యత్నించారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. తన గన్ మెన్ తో పాటు మరికొందరు మిత్రులు తనను రక్షించారని అన్నారు. తనపై హత్యాయత్నం చేసినవారికి ఒకటే చెబుతున్నానని తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు.
 

English Title
Balka Suman Reacts

MORE FROM AUTHOR

RELATED ARTICLES