ఆన్‌లైన్‌లో కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు

ఆన్‌లైన్‌లో కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు
x
Highlights

కిడ్నీ దాతలు కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తాడు. కిడ్నీకి కోటికి పైగా ఇస్తానని నమ్మిస్తాడు. ఇందుకు ముందుగా రిజిస్ట్రేషన్... తదితర కారాణాలు చెప్పి...

కిడ్నీ దాతలు కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తాడు. కిడ్నీకి కోటికి పైగా ఇస్తానని నమ్మిస్తాడు. ఇందుకు ముందుగా రిజిస్ట్రేషన్... తదితర కారాణాలు చెప్పి లక్ష రూపాయల వరకు బాధితుల నుంచి వసూలు చేస్తాడు. ఇలా పలు రాష్ర్టాల్లో మోసానికి పాల్పడిన చెన్నైకు చెందిన వ్యక్తిని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలుగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారిని బురిడీ కొట్టించాడు. నమ్మి మోసపోయిన బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసగాడి గుట్టు బయటపడింది.

చెన్నై, మధురై ప్రాంతానికి చెందిన సూర్యశివరాం ఆరు నెలల కిందట కిడ్నీ సేల్ పేరుతో ఓ వెబ్‌సైట్ తెరిచాడు. అందులో అతని పేరు, ఫోన్ నంబర్ పెట్టి కిడ్నీ దాతలు ఉంటే సంప్రదించాలని కోరాడు. దీంతో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరుకు చెందిన కొందమంది పేదవారు అతన్ని సంప్రదించారు. అలా సంప్రదించగానే..రిజిస్ట్రేషన్ పేరుతో 15 వేలు కట్టించుకుంటాడు. ఆ తర్వాత ఈ మ్యాటర్‌ ఎక్కడ కూడా మాట్లాడొద్దని చెప్పడంతో పాటు మీరు కోరుకునే చోటే కిడ్నీ మార్పిడి జరుగుతుందని నమ్మిస్తాడు.

అవసరమై ఓ ఫేక్ మెసేజ్ సృష్టించి... బాధితుడికి అందాల్సి 50 లక్షలు తన ఖాతాలో జమ చేశారని వాట్సాప్‌లో పంపించి బోల్తా కొట్టిస్తాడు. ఇది నిజమని నమ్మి బాధితులు తొందరపాటు చూపిస్తే వారిని మరికొంత డబ్బు అడుగుతాడు. వారు అనుమానం వ్యక్తం చేసి నిలదీస్తే.. గతంలో ఓ బాధితుడికి కిడ్నీ దానం చేస్తే 3 కోట్లు ఇప్పించానని తప్పుడు పత్రాలు చూపిస్తాడు. అదే విధంగా కిడ్నీ ఫెడరేషన్ సర్టిఫికెట్ పేరుతో ఓ పత్రాన్ని సృష్టించి దాతలకు పంపిస్తాడు. ఇలా అనేక రకాలుగా బాధితులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ అందినకాడికి డబ్బుల వసూలు చేస్తాడు. ఇలా 15 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తాడు. ఈ విధంగా హైదరాబాద్‌లో పలువురిని మోసం చేసిన సూర్యశివరాంను పట్టుకునేందుకు రాచకొండ ఎస్‌ఓటీ మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ బృందం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడు సూర్యశివరాంను నేరేడ్‌మెట్‌లో పట్టుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories