పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కారణమేంటి...అంచనాలు తప్పాయా..?

పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కారణమేంటి...అంచనాలు తప్పాయా..?
x
Highlights

ప్రశ్నిస్తామంటూ పార్టీ పెట్టారు ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. మీటింగ్ ల్లో పంచ్ డైలాగులు పేల్చారు ఆవేశాల తూటాలు పేల్చారు మార్పు తీసుకురావడమే...

ప్రశ్నిస్తామంటూ పార్టీ పెట్టారు ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. మీటింగ్ ల్లో పంచ్ డైలాగులు పేల్చారు ఆవేశాల తూటాలు పేల్చారు మార్పు తీసుకురావడమే లక్ష్యం అన్నారు తీరా ఎన్నికలయ్యాక మొత్తం సైలెంట్ అయిపోయారు. పోలింగ్ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మౌనవ్రతం పాటిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

వామపక్షాలు, బీఎస్పీతో కలిసి మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన జనసేన టీడీపీ, వైసీపీ తర్వాత బలమైన రాజకీయ పార్టీగా నిలిపేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ దూసుకుపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేస్తానని పలు ఎన్నికల సమావేశాల్లో ప్రకటించారు.

ఎన్నికలు ముగిశాక పార్టీలన్నీ తమకెన్ని సీట్లు వస్తాయో అన్న లెక్కలు వేసుకుంటున్నాయి. తమ పార్టీ సెంచరీ కొడుతుందని కొందరు లీడర్లు 150 సీట్లు సాధిస్తామని మరో పార్టీ నాయకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇటు ఈవీఎంల పనితీరుపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో జనసేన నుంచి ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ లేదు. పవన్ కల్యాణ్ కూడా చిన్నపాటి కామెంట్ కూడా చేయలేదు. ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఈ ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతామని భావించిన జనసేన వర్గాలు ఓటింగ్ సరళి తర్వాత సైలెంట్ కావడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తాము వేసుకున్న అంచనాలు తలకిందులయ్యేలా పరిస్థితులున్నాయని భావిస్తున్నారా..? లేక ఫలితాల వరకు కామెంట్స్ ఎందుకని కూర్చుండిపోయారా..? ఎన్నికల సమయంలో తామే కింగ్ అని ప్రకటించుకున్నా చివరకు కింగ్ మేకర్ అవుతామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ ఎన్నికలు ముగిశాక పరిస్థితులు అలా లేవని తెలుసుకున్నారా..? ఇలా రకరకాలుగా వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే సేనాని సైలంట్ ను బ్రేక్ చేయాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories