logo

ఎమ్మెల్యే బాలకృష్ణకు పవన్ ఎవరో తెలీదట

ఎమ్మెల్యే బాలకృష్ణకు పవన్ ఎవరో తెలీదట

పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నటుడిగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులే ఉన్నారు. అయితే ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు మాత్రం పవన్ ఎవరో తెలీదట.

జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి బాలకృష్ణను ప్రశ్నించగా.. "పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు" అంటూ కారును ఎక్కి వెళ్లిపోయాడు.

అయితే బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరు సినిమా హీరోలే. గతంలో ఈ ఇద్దరు కొన్ని స్టేజ్‌లపైన కలిసి ఫొటోలు కూడా తీసుకున్నారు. అది పక్కన పెట్టినా గత ఎన్నికల్లో టీడీపీకే మద్దతును ఇచ్చి ప్రచారం చేశారు పవన్. ఇలా తమ పార్టీకే ప్రచారం చేసిన వ్యక్తిని బాలకృష్ణ తెలీదని చెప్పడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి బాలయ్య స్పందనపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

లైవ్ టీవి

Share it
Top