హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన బాలకృష్ణ

Submitted by arun on Mon, 02/05/2018 - 11:28
 Actor Balakrishna

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు కుడి భుజానికి సర్జరీ విజయవంతమైంది. దీంతో సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జి అయ్యారు.గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో గాయాల‌కు గురైన ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డర్ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నారు. అప్పట్లో ప్రాథ‌మిక చికిత్స తీసుకున్న ఆయ‌న‌కు ఇటీవల మేజ‌ర్ స‌ర్జరీ నిర్వహించాల‌ని వైద్యులు తేల్చారు. అయిన‌ప్పటికీ ఆయ‌న ‘జైసింహా’ చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు. దీంతో ఈ స‌ర్జరీ చేసుకోలేక‌పోయారు. ఈ నొప్పి రోజురోజుకి తీవ్ర‌మ‌వ‌డంతో స‌ర్జరీ అనివార్యమైంది.క‌న్సల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జన్ డాక్టర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)లు బాలయ్య కుడిచేయికి స‌ర్జరీ చేశారు. రెండు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన నేడు డిశ్చార్జి అయ్యారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బాలయ్యకు డాక్టర్లు సూచించారు.

English Title
balakrishna discharged from continental hospitals

MORE FROM AUTHOR

RELATED ARTICLES