టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా రెడీ... వీరికే ఛాన్స్ ?

టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా రెడీ... వీరికే ఛాన్స్ ?
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ్టి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేటి నుంచి వరుసగా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఇప్పటికే...

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ్టి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేటి నుంచి వరుసగా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఇప్పటికే 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ఇవాళ టీడీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న సీఎం చంద్రబాబు ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక గురించి కసరత్తు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న 49 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు సీట్ల కోసం నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఎంపీ సీట్ల విషయానికి వస్తే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు. విజయనగరం నుంచి అశోక్ గజపతి,అరకు కిషోర్ చంద్రదేవ్,విశాఖ భరత్ లేదంటే పల్లా శ్రీనివాస్,అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్,కాకినాడ చలమలశెట్టి సునీల్,అమలాపురం హర్షకుమార్ లేదంటే జీఎంసి బాలయోగి కుమారుడు హరీష్, రాజమండ్రి నుంచి ముళ్ళపూడి రేణుక అలాగే మురళీ మోహన్ కోడలు మాగంటి రూప పేర్లను పరిశీలిస్తున్నారు.

మచిలీపట్నం ఎంపీ స్థానానికి వంగవీటి రాధాను బరిలోకి దించాలా లేదంటే కొనకళ్ల నారాయణనే పోటీ చేయించాలా అనే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఏలూరుకి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు,విజయవాడ నుంచి సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని,గుంటూరుకి ఎంపీ గల్లా జయదేవ్,నరసరావుపేటకు ఎంపీ రాయపాటి సాంబశివరావు,బాపట్లకు తెనాలి శ్రావణ్ కుమార్,ఒంగోలు ఎంపీ సీటు కోసం మంత్రి శిద్దా రాఘవరావు,నెల్లూరు కోసం బీదా మస్తాన్ రావు,చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎంపీ శివ ప్రసాద్, తిరుపతి పనబాక లక్ష్మి, రాజంపేట సాయి ప్రతాప్, లేదంటే శ్రీనివాసరెడ్డి అలాగే డీకే సత్యప్రభ కడపకు మంత్రి ఆదినారాయణ రెడ్డి,హిందూపురం నిమ్మల కిష్టప్ప అనంతపురం దివాకర రెడ్డి కొడుకు జేసి పవన్, నంద్యాలకు మాండ్ర శివానందరెడ్డి అలాగే ఎస్పీవై రెడ్డి కుమార్తె పేరును పరిశీలిస్తున్నారు, కర్నూలుకు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది. నరసాపురం స్థానం కోసం కొత్త అభ్యర్ధి పేరును పరిశీలిస్తున్నారు.

మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాల్టి నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ నెల 17న విజయనగరం, విశాఖ, ఊభయ గోదావరి జిల్లాల్లో సభలకు 18న నెల్లూరు, గుంటూరు ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సభలకు హాజరవుతారు. 19న కర్నూలు , అనంతపురం, కడప జిల్లాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొని ఆ తర్వాత బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories