ఏపీ కేబినెట్‌ అజెండాపై ముగిసిన 'స్క్రీనింగ్‌'

ఏపీ కేబినెట్‌ అజెండాపై ముగిసిన స్క్రీనింగ్‌
x
Highlights

ఏపీ కేబినెట్‌ అజెండాపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సీఎస్‌ అధ్యక్షతన సమావేశమైన వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌,...

ఏపీ కేబినెట్‌ అజెండాపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సీఎస్‌ అధ్యక్షతన సమావేశమైన వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల్‌, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి శ్రీధర్‌‌లు మంత్రివర్గ అజెండా అంశాలను పరిశీలించారు. ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు..ఉపాధి పరిస్థితులు, తాగునీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఫొని నష్టం-అంచనాలు తదితర అంశాలపై స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి ఖరారు చేసింది. వీటిని సీఈవో ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈనెల 14న కేబినెట్‌ భేటీ నిర్వహించాలని సీఎం భావిస్తున్న తరుణంలో వేటిని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తుందనే విషయంపై వేచిచూడాల్సి ఉంది. ఈసీఐ అనుమతిస్తే మే 14న ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories