నిజామాబాద్‌ జిల్లాలో మృత్యువును జయించిన రెండేళ్ల బాలుడు

x
Highlights

ఆమె మాతృత్వానికి కొత్త అర్థం చెప్పింది. ఒకవైపు తన తల్లి, కన్న బిడ్డ ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నా పంటి బిగువన బాధను బరిస్తూ రెండు నెలల పసి కందును...

ఆమె మాతృత్వానికి కొత్త అర్థం చెప్పింది. ఒకవైపు తన తల్లి, కన్న బిడ్డ ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నా పంటి బిగువన బాధను బరిస్తూ రెండు నెలల పసి కందును కాపాడుకుంది. కాలు విరిగినా గంటన్నర పాటు మృత్యువుతో పోరాటం చేసింది. పేగు బంధానికి ఉన్న విలువేంటో లోకానికి చాటి చెప్పింది. తల్లి, బిడ్డ ప్రాణాలు పోయాయని ఏడ్వాలో కొడుకును రక్షించుకున్నానన్న ఆనంద పడాలో అర్థం కాని పరిస్థితి ఆమెది.

బాహుబలిలోని సీన్‌ చూశారు కదా...అచ్చం అలాంటి సీనే నిజామాబాద్‌ జిల్లా మోండోరాలో రిపీట్‌ అయింది. కళ్ల ముందే కన్న తల్లి... బిడ్డ బావిలో పడిపోయారు...వారిద్దరూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
రెండు నెలల కొడుకుతో సహా బావిలో పడిపోయింది సంగీత. కన్నతల్లి, మూడేళ్ల పాప...కళ్ల ముందే మునిగిపోతున్నారు. బావిలో పడ్డవారి...ఒక్కొక్కరి ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయ్. ఒక చేత్తో కొడుకు రక్షించుకుంటూనే...మరో చేత్తో పైపు పట్టుకుంది. గంటన్నర పాటు మృత్యువుతో పోరాటం..దుంఖాన్ని దిగమింగుతూనే....కాపాడాలంటూ సంగీత ఆర్తనాదాలు..కొడుకు ముక్కులోకి నీళ్లు వెళ్తున్నాయ్.
స్పందించిన స్థానికులు...సంగీతతో పాటు ఆమె కొడుకును బయటకు తీశారు.

నిజామాబాద్‌ జిల్లా మెండోరా వద్ద జరిగిన ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. 11 మంది ప్రాణాలు కోల్పోగా 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆరు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. ఆ గ్రామాల్లో ఎవర్ని కదిలించిన కన్నీటి గాథలే. ఆర్మూర్‌ మండలం అలూరు చెందిన సంగీత బీడి కార్మికురాలు. తల్లి, ఇద్దరు పిల్లలతో పాటు మెండోరా వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

మెండోరా వద్ద ఆటో అదుపు తప్పి బావిలోకి పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా ఒక్కొక్కరు జలసమాధి అవుతున్నారు. కన్నతల్లి, మూడేళ్ల మనస్విని మునిగిపోతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి సంగీతది. తన శక్తినంత కూడ దీసుకొని పంటి బిగువన దుంఖాన్ని ఆపుకొంది. ఒక చేత్తో బిడ్డను కాపాడుకుంటూనే మరో చేత్తో తాను బిడ్డ మునిగిపోకుండా పైపును పట్టుకుంది.

ఒకవైపు కొడుకు ముక్కులోకి నీళ్లు వెళ్తున్నాయ్ కంటనీరు వస్తున్నా ఒంట్లో శక్తి లేకపోయినా రక్షించాలంటూ గంటన్నర పాటు ఆర్తనాదాలు చేసింది. కాలు విరిగిపోయినా అధైర్య పడకుండా మృత్యువుతో పోరాడింది. ఆమె కేకలు విన్న స్థానికులు సంగీతతో పాటు ఆమె రెండు నెలల కొడుకును రక్షించారు.

కన్న తల్లి, కూతురు చనిపోయిందని బాధపడాలో తాను, కొడుకు బతికామని సంతోష పడాలో అర్థం కాని పరిస్థితి సంగీతది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం నుంచి సంగీతం కుటుంబం తేరుకోలేకపోతోంది. నిన్నటి వరకు తనతో ఉన్న కూతురునుతలచుకుంటూ కన్నీరుమున్నీరవుతోంది సంగీత.

Show Full Article
Print Article
Next Story
More Stories