logo

చిన్నారికి కొండంత కష్టం.. కన్నీరుపెట్టిన సానియా మీర్జా

చిన్నారికి కొండంత కష్టం.. కన్నీరుపెట్టిన సానియా మీర్జా

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారికి అప్పుడే కొండంత కష్టం వచ్చింది. చిన్నప్పుడే తల్లి మాట వినే అవకాశం లేకుండా పోయింది. పుట్టినప్పటినుంచే ఈ చిన్నారికి వినికిడి సమస్య వచ్చింది. దాంతో ఎవరు ఎలాంటి సంజ్ఞలు చేసినా చిన్నారికి వినిపించదు. ఈ విషయాన్నీ చాలా రోజులకు గాని గుర్తించలేదు ఆ బేబీ తల్లి. అప్పటివరకు తల్లి ఎంత పిలిచినా ఆ బాబు పలికేవాడు కాదు. దాంతో ఆమె బాధపడేది. అయితే ఇటీవల బేబీ కేర్ సెంటర్ కు తీసుకెళితే చిన్నారికి వినికిడి సమస్య ఉందని తేల్చారు డాక్టర్లు. దాంతో ముద్దులోకి తన బిడ్డ తన మాట వినే అవకాశం లేకుండా పోయిందని బాధపడింది. ఈ క్రమంలో ఆ చిన్నారికి వినికిడి యంత్రం అమర్చారు వైద్యులు. దీనివల్ల తొలిసారిగా చిన్నారి తన తల్లి మాటలను వినగలిగాడు. ఆ సమయంలో ఈ చిన్నారి స్పందన చూసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఇది జరిగి చాలా రోజులే అయినా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎందుకంటే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ వీడియో చూసి కంటతడి పెట్టింది. ఆమె తన ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేశారు. కాగా ఇది చూసిన నెటిజన్లు కూడా కంటతడి పెడుతున్నారు.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top