ఆకలి తీర్చాల్సిన ఇడ్లీ.. చిన్నారి గొంతు నులిమేసింది

Submitted by arun on Sat, 03/17/2018 - 11:13
 idli

ఎప్పటిలాగే ఆ చిన్నారి.. స్కూలుకు రెడీ అవుతోంది. ఆమె తల్లి తన గారాల పట్టికి టిఫిన్ తినిపిద్దామని వేడివేడిగా ఇడ్లీలు కూడా చేసి పెట్టింది. అంతా బానే ఉంది. కాసేపట్లో ఆ పాప టిఫిన్ తినేసి స్కూలుకు వెళ్లేందుకూ రెడీ అవుతోంది. కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఎందుకు ఉంటుంది? విధి వక్రించింది. ఆ చిన్నారి తిన్న ఇడ్లీ.. ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. ఆ పాప ప్రాణం విలవిల్లాడింది. డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టినా.. లాభం లేకపోయింది. దారి మధ్యలోనే ఊపిరి ఆడకపోవడంతో.. ఆ చిన్నారి మరణించింది.

తమిళనాడులోని నాగర్ కోవిల్ లో ఈ విషాదం జరిగింది. ఆకలి తీర్చాల్సిన ఇడ్లీ.. ఇలా 13 ఏళ్ల చిన్నారి అఫ్రిన్ గొంతులో అడ్డం పడి.. ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా చలాకీగా ఉన్న తమ బిడ్డ… చూస్తుండగానే.. అలా ప్రాణం పోగొట్టుకున్న తీరు.. తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది.

అందుకే.. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భం.. మరోసారి తల్లిదండ్రులకు గుర్తుచేస్తోంది. ఇడ్లీనే కాదు.. చివరికి మంచి నీళ్లు తాగించినా కూడా.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. వారికి ఇబ్బంది కలగకుండా ఆహారం అందించాలని ఈ విషాదం.. గుణపాఠం చెబుతోంది.

English Title
baby dies in tamil nadu after idli gets stuck in his throat

MORE FROM AUTHOR

RELATED ARTICLES