విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కావాలంటే నా కోరిక తీర్చు..

విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కావాలంటే నా కోరిక తీర్చు..
x
Highlights

మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతమాత్రాన వేధింపులు ఆగుతున్నాయా అంటే...

మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతమాత్రాన వేధింపులు ఆగుతున్నాయా అంటే చెప్పడం కష్టం. తాజాగా తనకు ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయాని.. డైరెక్టర్‌ కోరికలు తీరిస్తే సినిమాలో అవకాశం ఇస్తానన్నాడని ఓ వర్దమాన నటి తెలిపింది.

ఇటీవల కోలీవుడ్‌కు చెందిన నటి షమ్ము శివ కార్తికేయన్ సినిమా 'మిస్టర్ లోకల్' ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కాసేపు నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సమయంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు

ఒక ప్రశ్నకు సమాధానంగా తాను కూడా మీటూ బాధితురాలినేని తెలిపింది. అయితే తాను ఇలాంటి వాటిపై ఎవరికీ ఫిర్యాదులు చేయనని, ఇచ్చినా కూడా ఏం లాభం ఉండదని, ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని బదులిచ్చింది. ఓ కొత్త దర్శకుడు తన కోరిక తీరిస్తే.. విజయ్‌ దేవరకొండతో తీసే చిత్రంలో అవకాశం ఇస్తానని అన్నాడని సూటిగా చెప్పేసింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories