ఐఎస్ఐ మార్క్ లేకుండా నీళ్ల బాటిళ్లు అమ్మడం నేరం

ఐఎస్ఐ మార్క్ లేకుండా నీళ్ల బాటిళ్లు అమ్మడం నేరం
x
Highlights

ఐఎస్ఐ మార్క్ లేకుండా నీళ్ల బాటిళ్లు అమ్మడం పెద్ద నేరమని, అన్ని దుకాణాల్లోనూ నీళ్ల బాటిళ్ల ధర ఒకేరీతిలో ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి...

ఐఎస్ఐ మార్క్ లేకుండా నీళ్ల బాటిళ్లు అమ్మడం పెద్ద నేరమని, అన్ని దుకాణాల్లోనూ నీళ్ల బాటిళ్ల ధర ఒకేరీతిలో ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారంనాడు తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఓ ప్రశ్నకు పాశ్వాన్ సమాధానమిస్తూ, నీళ్ల బాటిళ్లపై ముద్రించిన రేటుకంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి తమ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాను దీనిపై ఒక అడ్వయిజరీ కూడా పంపాననీ, అయితే సేవారంగానికి చెందిన కొందరు కోర్టుకు వెళ్లారని చెప్పారు.

హోటల్‌లో నీళ్ల బాటిల్‌కు ఒక రేటు, బయట మరో రేటుతో అమ్మడం తప్పు అని, సేవరంగానికి చెందిన వారు, ఇతరులు కోర్టుకు వెళ్తుండటంతో దీనికి ప్రత్నామ్నాయం మార్గం కోసం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేకుండా నీళ్ల బాటిళ్ల అమ్మకాలు జరిపితే రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు జరపొచ్చని అన్నారు. ఐఎస్ఐ మార్క్ లేకపోడవం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అలా అమ్మడం తీవ్ర నేరమే కాకుండా, కఠిన శిక్ష విధించేందుకు వీలుందని పాశ్వాన్ వివరణ ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories