పవన్...ఆ ప్రతిజ్ఞ ఏమైంది? : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

Submitted by arun on Mon, 07/23/2018 - 14:34
rajendra prasad

వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రైతులను రెచ్చగొడుతున్నారని పవన్‌పై మండిపడిన రాజేంద్రప్రసాద్... ప్రత్యేక హోదా కోసం ఆమరణదీక్ష చేస్తానన్న ప్రతిజ్ఞ ఏమైందని ప్రశ్నించారు. కేసుల కోసం జగన్‌, మోడీ ఇచ్చే ప్యాకేజీ పవన్‌ బీజేపీకి లొంగిపోయారని బాబు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. చిరంజీవి కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా పార్టీని అమ్ముకుంటే పవన్ బీజేపీకి రిటైల్‌గా పార్టీని అమ్ముకున్నారని ఆరోపించారు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

English Title
baburajendraprasad comments on pawankalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES