కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 08/31/2018 - 16:09
Babu Gogineni

బిగ్ బాస్2 ఎంత రసవత్తరంగా సాగుతుందో అదేస్థాయిలో వివాదాలు కూడా మొదలవుతున్నాయి. కౌశల్ కు బయట కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. దీనిపై బాబు గోగినేని తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. బిగ్ బాస్ జరుగుతున్న విధానంపై, కౌశలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ లో కౌశల్ హాట్ ఫెవరెట్ గా కొనసాగుతున్నాడు. కౌశల్ ఫైనల్ చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆర్మీ గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్మీ... కౌశల్ పాపులారిటీతో పుట్టింది కాదని వ్యాఖ్యానించారు. ‘‘కౌశల్‌ను బిగ్‌బాస్ షో నుంచి తొలగించాలని కోరుకుంటున్నా. డే వన్ నుంచి ఇప్పటికీ అతను హౌస్‌లోనే ఉన్నాడు. కౌశల్ ఆర్మీ బయట ఎలా ఉందో   అతను తెలుసుకోవాలి. కౌశల్ ఆర్మీ క్రియేట్ అవడంలో అతని పాత్ర ఉంది. ఈ ఆర్మీ అతని పాపులారిటీ నుంచి పుట్టింది కాదు. అసలు ఏంటా కౌశల్ ఆర్మీ? తమషా ఆపేయండి ఇక. మీకు గనుక నిజంగా ఆసక్తి ఉంటే.. ఇండియన్ ఆర్మీలో చేరి.. కనీసం జాతికైనా సేవ చెయ్యండి. బిగ్‌బాస్ అనేది జస్ట్ గేమ్ మాత్రమే. జీవితం అనేది బిగ్గర్ బాస్. ఇలాంటి సిల్లీ ఆర్మీస్‌‌ని తప్పనిసరిగా నిషేధించాలి’’ అని బాబు గోగినేని తెలిపారు.

English Title
Babu Gogineni Sensational Comments On Kaushal Army

MORE FROM AUTHOR

RELATED ARTICLES