బాబు గోగినేనిని బ‌ద్నాం చేస్తున్న రాజ‌మౌళి

Submitted by arun on Thu, 01/04/2018 - 14:31
BabuGogineniRajamouli

బాబు గోగినేని అతని పేరు వింటే కొంతమంది మాయగాళ్ళు తడుపుకుంటున్నారు. దొంగ‌స్వామీలు, దొంగ‌డాక్ట‌ర్ల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొద్దిరోజుల క్రితం జ్యోతిష్యం పేరుతో అమ‌యాక ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న ఓ పండితుడి బండారం లైవ్ షోలో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఇక  ప్రాణ చికిత్స పేరుతో ఫోన్ కాల్ తో రోగం నయం చేస్తాం అన్న వాళ్ళని కూడా లైవ్ లోనే చుక్కలు చూపించిన బాబు గోగినేని ఇప్పుడు డైర‌క్ట‌ర్ జ‌క్క‌న్న తీరును ఎండ‌గ‌డుతున్నారు. తాను నాస్తికుడిని అని చెప్పుకుంటున్న రాజ‌మౌళి ఈజీగా చొక్కాలు మార్చి గుడికి వెళుతుంటారు. అలా గుడికి వెళ్ల‌డం పై తానేమి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంలేద‌ని..నాస్తికుణ్ని అనిచెప్పుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి వారి వ‌ల్ల తమ ప‌రువు పోతుంద‌ని  ఇండియన్ హ్యూమనిస్ట్- రేషనలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని రాజమౌళి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో సీపీఐ నారాయణ కూడా ఇలాగే ప్రవర్తించారని రాజమౌళికి ఈ విషయంలో తాను సంధించిన ప్రశ్నలకు జవాబు రాలేదని ఆయన తప్పు చేశారు కాబట్టి సమాధానం ఇవ్వలేరని భావిస్తున్నట్లు బాబు అభిప్రాయపడ్డారు.

English Title
Babu Gogineni fires on Rajamouli

MORE FROM AUTHOR

RELATED ARTICLES