లాస్ ఏంజిల్స్ లో పరిస్థితి మరీ ఇంత దారుణమా..!

లాస్ ఏంజిల్స్ లో పరిస్థితి మరీ ఇంత దారుణమా..!
x
Highlights

అమెరికాలో రెండో అతి పెద్ద నగరం లాస్ ఏంజిల్స్. హాలీవుడ్ మూవీలకు నెలవైన లాస్ ఏంజిల్స్ ఎంతో పేరు గాంచిందో.. ఇళ్లు లేని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతు...

అమెరికాలో రెండో అతి పెద్ద నగరం లాస్ ఏంజిల్స్. హాలీవుడ్ మూవీలకు నెలవైన లాస్ ఏంజిల్స్ ఎంతో పేరు గాంచిందో.. ఇళ్లు లేని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతు అంతే ప్రఖ్యాతిని సంపాదించుకుంటుంది. ఇక్కడ ఇల్లు లేని వారి సంఖ్య గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 12శాతం పెరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఎక్కువ మంది నిరుపేదలు, నిరక్షరాస్యులే నివాస స్థలం లేకుండా వీధుల్లో తలదాచుకుంటున్నట్లు లాస్ ఏంజిల్స్ హోమ్ లెస్ సర్వీస్ అథారిటీ స్పష్టంచేసింది.

ఇక్కడ వేశ్యా గృహాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నిరాశ్రయుల సంఖ్య అధికంగా ఉండటంతోనే ఇలాంటి వృత్తిలో కొనసాగుతున్నట్లు కొందరి వాదన. కారణం ఏదైనా అక్కడ నిత్యం 60వేల మంది ఫుట్ పాట్ ల మీద, పార్కులు, ప్రభుత్వం ఏర్పాటుచేసిన షెల్టర్ లో తలదాచుకుంటున్నారని సర్వే వెల్లడించింది. ఎక్కువ మంది రోడ్లపక్కన గుడారాలు ఏర్పాటుచేసుకొని జీవనం సాగిస్తున్నారు.

అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో వేశ్యా వృత్తి చట్టబద్ధం కావటంతో ఈ కూపంలోకి దింపటానికి ప్రపంచం నలు మూలల నుండి అమ్మాయిలను బలవంతంగా తీసుకొనట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన నగరాల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ లో ఇలాంటి పరిస్థితి ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories