టుస్సాడ్స్ మ్యూజియంలో ‘కట్టప్ప’ విగ్రహం

Submitted by arun on Mon, 03/12/2018 - 14:54
Kattappa

బాహుబలి కట్టప్ప సత్యరాజ్.. అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియంలో.. ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సినిమాల్లో చేసిన కృషికి గాను.. ఇలా గౌరవిస్తున్నారు. ఈ విషయంపై.. ఈ మధ్యే సత్యరాజ్ కు అధికారిక సమాచారం కూడా అందింది. ఇంతటి గుర్తింపు రావడంలో.. కట్టప్ప క్యారెక్టర్ కూడా కీలక పాత్ర పోషించిందని సత్యరాజ్ ఆనందం వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక.. సత్యరాజ్ కంటే ముందే.. బాహుబలి ప్రభాస్ కూడా ఈ గౌరవం అందుకున్నాడు. బ్యాంకాక్ లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాహుబలితో వచ్చిన గుర్తింపుతోనే.. అప్పుడు మన యంగ్ రెబల్ స్టార్ కు ఆ ఘనత సాధ్యమైందని అంతా ప్రశంసించారు. ఇప్పుడు సత్యరాజ్ ఈ జాబితాలో రెండో వాడయ్యాడు. బాహుబలికి సంబంధించి.. ఇంకెంత మంది మైనపు విగ్రహ జాబితాలో చేరతారో అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా సరదాగా మాట్లాడుకుంటున్నాయి.

మరో విశేషం ఏంటంటే.. తమిళ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి గుర్తింపు పొందిన మొదటి నటుడిగా కూడా సత్యరాజ్ గుర్తింపు పొందాడు. ఇలా.. ఒకేసారి డబుల్ ధమాకాను సొంతం చేసుకున్నాడు.

English Title
Baahubali's Kattappa To Get A Statue At London Wax Museum

MORE FROM AUTHOR

RELATED ARTICLES