దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి

దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి
x
Highlights

దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో చితక్కొట్టారు. గుళ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని దారుణంగా హింసించారు. ఐదారు మంది యువకులు కలిసి ఒక్కడిని...

దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో చితక్కొట్టారు. గుళ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని దారుణంగా హింసించారు. ఐదారు మంది యువకులు కలిసి ఒక్కడిని చేసి అతడిపై దాడిచేశారు. వదిలేయమని ప్రాధేయపడినా కనుకరించలేదు. పొడవాటి కర్రలతో ఎడాపెడా కొట్టారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ దారుణం జరిగింది. అగ్రకులానికి చెందిన వ్యక్తులే అతడిపై దాడిచేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళితులకు గుళ్లోకి వెళ్లే అర్హత లేదంటూ చావబాదారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జూన్ 1న పాలి జిల్లా ధనేరియా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళిత మైనర్ బాలుడిని కొందరు యువకులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిలో ఒకరు కాషాయ కండువా ధరించి ఉన్నాడు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా ఉంది. బాధిత మైనర్ బాలుడిపైనా కొందరు వ్యక్తులు కేసు పెట్టారు. ఓ చిన్నారిని లైంగికంగా వేధించాడని అందుకే అతడిపై దాడిచేసినట్లు చెప్పారు. దాంతో బాధిత యువకుడిపై పోస్కోచట్టం కింద కేసుపెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఐతే బాధితుడిని అరెస్ట్ చేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. గుళ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతోనే అతడిని కొట్టారని ఇప్పుడు తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వాపోతున్నారు. అగ్రవర్ణాలు చెప్పినట్లుగానే పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories