అక్కడ ఓడితే.. ఉత్తమ్ చాప్టర్ క్లోజ్. మరి గెలిస్తే..?

అక్కడ ఓడితే.. ఉత్తమ్ చాప్టర్ క్లోజ్. మరి గెలిస్తే..?
x
Highlights

ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫు నుండి నల్లగొండ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడి పరిస్థితి ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఇప్పటికే...

ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫు నుండి నల్లగొండ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడి పరిస్థితి ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఇప్పటికే శాసనసభ హోదాలో ఉన్న ఉత్తంకుమార్ రెడ్డిని కావాలనే పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే నల్లగొండ బరిలో దించిండు అని అంటారు. ఇటివల జరిగిన హోరాహోరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలో దిగి గెలుపొందిన అభ్యర్థుల్లో ఉత్తంకుమార్ రెడ్డి ఒకరు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తం మరోక్కసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగటం అనేది కొంతవరకు సాహసమే అని చెప్పాలి మరి! అయితే ఇప్పడు ఉత్తంకుమార్ రెడ్డి పెద్దతలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పడు కానీ లోక్ సభ ఎన్నికల్లో నెగ్గెలేదంటే ఇక ఉత్తం పని ఉత్తదే అని అనుకుంటున్నారు ప్రజలు. అంతటితో రాజకీయానికి కొంతమేర దెబ్బపడుతుంది. కాగా చాలా తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులకు ఎగబాకిన వ్యక్తుల్లో ఉత్తంకుమార్ అనే చెప్పవచ్చు అయితే ఇప్పడు గెలవకపోతే ఉత్తం పరిస్థితి ఎంటి? ఇక రాజకీయంలో కీలక పదవులు దక్కే అవకాశాలు తక్కువై పోతాయి. రాజకీయ భవితవ్యం దెబ్బ తింటుందనే చెప్పవచ్చు.

అయితే నల్లగొండ జిల్లా పోరాటాలకు పెట్టింది పేరు. ఎంతో మహానుభావులు అసువులు బాసిన నెల నల్లగొండ జిల్లా. నల్లగొండ ఎంతో కోంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఉన్న సీటే అయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీనూ రివర్స్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇలాంటి సమయంలో మరొక్కసారి కాంగ్రెస్ నల్లగొండపైనే పరిక్షించుకొంటుంది. ఇక ఇలాంటి సమయంలో కానీ నల్లగొండపై కాంగ్రెస్ జెండా రేపరేపలాడితే ఓ విధంగా సంచలనం అనే చెప్పవచ్చు మరి. ఇక ఈ దెబ్బతో ఉత్తంకుమార్ రెడ్డికి హై కమాండ్ దగ్గర మంచీ బలం పెరుగుతుంది. ఒకవేళ నల్లగొండలో అసెంబ్లీ ఎన్నికల్లాగే కాంగ్రెస్‌కు సీను రివర్స్ అయి ఓడితే పరువు పోతుంది. ఉత్తం రాజకీయ భవితవ్యం దెబ్బ తిటుంది. ఒకవేళ ఉత్తమ్ కుమార్ గెలిస్తే మాత్రం వెంటనే మరో ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీగా నెగ్గితే ఆ పదవినే చేపడతారు. అయితే అక్కడ పోటీ చేసి మళ్లీ దాన్ని నిలబెట్టుకోవడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో పరీక్షే అవుతుంది! చూడాలి మరీ లోక్ సభ ఎన్నికల్లో ఉత్తం నెగ్గుతారా లేక తగ్గుతారా అనేది.

Show Full Article
Print Article
Next Story
More Stories