మంత్రి అఖిలప్రియతో మనస్పర్థలు వాస్తవమే: సుబ్బారెడ్డి

Submitted by arun on Fri, 04/13/2018 - 11:23
Allagadda

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇకపై ఆళ్లగడ్డలో కాలు పెట్టవద్దని సీఎం చంద్రబాబు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలపై ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఉదయం విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు చెప్పినట్టుగా ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియకు, తనకు మధ్య విభేదాలు ఉన్నమాట నిజమేనని, అయితే, అవి చిన్నచిన్నవే తప్ప పెద్దవి కాదని అన్నారు. పార్టీ భవిష్యత్తు కోసం కలసి పని చేయాలని చంద్రబాబు సలహా ఇచ్చారని, ఆయన సలహాను పాటిస్తానని చెప్పారు. స్థానికంగా తనకు ప్రాధాన్యత తగ్గిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ పార్టీ కోసం అఖిల ప్రియతో కలసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబుకు స్పష్టం చేశానని అన్నారు.


 

English Title
av subba reddy talk to media

MORE FROM AUTHOR

RELATED ARTICLES