మామిడికాయ రసంతో విటమిన్లు పుష్కలంగా

మామిడికాయ రసంతో విటమిన్లు పుష్కలంగా
x
Highlights

వేసవి సీజన్‌లో మనకు ఎక్కువగా లభించే పండ్లు మామిడి పండ్లు...వీటిని ఈ సీజన్‌లో తినడం చాలా మంచిది. పచ్చి మామిడికాయలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పచ్చి...

వేసవి సీజన్‌లో మనకు ఎక్కువగా లభించే పండ్లు మామిడి పండ్లు...వీటిని ఈ సీజన్‌లో తినడం చాలా మంచిది. పచ్చి మామిడికాయలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పచ్చి మామిడిలో సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు :

టొమాటో - 20గ్రాములు

కందిపప్పు - 5గ్రాములు

పచ్చి మామిడికాయ - 50గ్రాములు

కరివేపాకు - ఒకకట్ట

ఎండుమిర్చి - ఒకటి

మిరియాలు - గ్రాము

ధనియాలు -గ్రాము

జీలకర్ర - గ్రాము

అల్లం వెల్లుల్లి - నాలుగు గ్రాములు

ఆవాలు - గ్రాము

పసుపు - టీస్పూన్

నూనె - టీస్పూన్

ఉప్పు - తగినంత

తయారీ విధానం :

ముందుగా మిరియాలు, ధనియాలు, జీలకర్రను వేయించుకోవాలి. ఆ తరువాత అవి కాస్త చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి.

ఇప్పుడు పచ్చి మామిడికాయను తీసుకోవాలి. మామిడికాయను నీళ్లలో వేసి ఉడికించాలి. మామిడికాయ బాగా ఉడికిన తరువాత నీళ్లలో నుంచి గుజ్జు తీసేయాలి. దీన్ని మ్యాంగో ప్యూరీ అంటారు. ఇప్పుడు కందిపప్పును ఉడికించుకోవాలి. టొమాటోలు, అల్లం, వెలుల్లి, రసం పౌడర్‌ వేసి ఉడికించాలి. తరువాత మ్యాంగో ప్యూరీ, ఉడికించిన కందిపప్పును కలపాలి. ఒకపాత్రలో నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేగించుకోవాలి. కరివేపాకు, పసుపు వేయాలి. దీన్ని టొమాటో మిశ్రమంలో కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి... టేస్టీ మామిడికాయ రసం రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories